ఈ వారంలో నేను మొత్తం మూడు మామిడి పండ్లు తిన్నాను. మూడింటిలోనూ ఒక విచిత్రం చూసాను. మొదటి రెండు పండ్లు చూసినపుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ... మూడో పండు కూడా అలాగే ఉండే సరికి ఇక అందరికీ చెప్పక తప్పదు అనిపించింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.... పండు పైకి చక్కగా మంచి రంగుతో, సువాసనతో అతి సామాన్యంగా ఉంది. కానీ లోపల టెంక మొలకెత్తి ఉంది. పండు రుచిలో గానీ రూపంలో గానీ రంగులో గానీ ఎలాంటి తేడా లేదు. అంతా బాగుంది కానీ ఈ టెంక పండు లోపలే మొలకెత్తడం అన్నది నేను ఇప్పటి దాకా ఎప్పుడూ చూడలేదు.
నేను తీసిన మూడవ పండు ఫోటోలు ఇక్కడ ఉంచుతున్నాను. నేను ఎప్పుడూ చూడలేదు కాబట్టి కొత్తగా, వింతగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి పండుని చూసి ఉంటే నాకు చెప్పండి. నేను ఎంచక్కా ఆ పండు గుజ్జంతా తినేసి టెంకలు మాత్రం మా ఆవరణలో నాటాను. ఒకటి చిన్నగా మొలక కూడా వచ్చింది భూమి పైకి.