ఈ వారంలో నేను మొత్తం మూడు మామిడి పండ్లు తిన్నాను. మూడింటిలోనూ ఒక విచిత్రం చూసాను. మొదటి రెండు పండ్లు చూసినపుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ... మూడో పండు కూడా అలాగే ఉండే సరికి ఇక అందరికీ చెప్పక తప్పదు అనిపించింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.... పండు పైకి చక్కగా మంచి రంగుతో, సువాసనతో అతి సామాన్యంగా ఉంది. కానీ లోపల టెంక మొలకెత్తి ఉంది. పండు రుచిలో గానీ రూపంలో గానీ రంగులో గానీ ఎలాంటి తేడా లేదు. అంతా బాగుంది కానీ ఈ టెంక పండు లోపలే మొలకెత్తడం అన్నది నేను ఇప్పటి దాకా ఎప్పుడూ చూడలేదు.
నేను తీసిన మూడవ పండు ఫోటోలు ఇక్కడ ఉంచుతున్నాను. నేను ఎప్పుడూ చూడలేదు కాబట్టి కొత్తగా, వింతగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి పండుని చూసి ఉంటే నాకు చెప్పండి. నేను ఎంచక్కా ఆ పండు గుజ్జంతా తినేసి టెంకలు మాత్రం మా ఆవరణలో నాటాను. ఒకటి చిన్నగా మొలక కూడా వచ్చింది భూమి పైకి.
9 కామెంట్లు:
ఈ సంవత్సరం నేను ఒక్క మామిడికాయ కుడా ఇంకా తినలేదు ..ప్చ్....(((
టెంక మొలకెత్తి ఉండేవి ఇంకా రుచిగా ఉంటాయంటారు..:)
పవన్ గారు,
మీ సత్వర స్పందనకు ధన్యవాదములు. మీకు ఇంకా చాలా సీజన్ ఉందిగా.. మెల్లగా తిందురులెండి, ఏం బాధ పడకండి.
ఈ టెంక మొలకెత్తడం అనేది పండే భూమి ని బట్టి కూడా ఉంటుంది, దేశం బట్టి కూడా పళ్ళ స్వభావం మారుతుంది
>>ఎప్పుడైనా చూసారా ??????
చూసాము,ఆ టెంక మహా వృక్షము అవుతుంది చూడండి కొన్నేళ్ళ తర్వాత
స్వర్నమల్లిక గారూ,
మొదటి టపాను పండ్లలో రారాజుగా పిలవబడే మామిడితో స్టార్ట్ చేసారన్నమాట. మీ బ్లాగు కూడా అలా రారాజులా సారీ రారాణిలా వెలగాలని కోరుకుంటున్నాను.
@ హరే కృష్ణ గారు: వ్యాఖ్యానించినందుకు ధన్యవాదములు. మీరు చెప్పింది నిజం అనిపిస్తోంది. మేము ఉండేది మధ్య / తూర్పు ఆఫ్రికా లో ఒక చిన్న దేశం. ఇక్కడ నేల మంచి సారవంతమైనది, ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండానే పంటలు పండిస్తారు. ఏమో నేను నాటించిన టెంకలు మంచి వృక్షాలు అవుతాయేమో.. చూద్దాం. ఇక్కడి విషయాలు ఇంకో టపాలో వివరిస్తాను.
@ ఆకాశరామన్న గారు: వ్యాఖ్యానించినందుకు ధన్యవాదములు. కొత్తగా రాయడం మొదలెట్టాను కాబట్టి తేలికగా రాయగలిగే టాపిక్ కోసం ఎదురు చూస్తూ ఉండగా, మా ఇంట్లో మామిడి టెంక ఇలా వచ్చింది. ఇంకేం అదృష్టం అనుకుంటూ మొదలెట్టాను. మీ ఆశిస్సులకి మళ్ళీ మళ్ళీ ధన్యవాదములు.
wow
నేనెప్పుడూ ఇలా చూడలెదు .
నాకూ చాలాసార్లు వచ్చిందండీ టెంకలో మొలక...మాకంటా ముందే మామిడిపళ్ళు తినేస్తున్నారు, అదృష్టవంతులు :)
@ మాలా కుమార్: మాల గారు నేను కూడా చూడలేదండి. అందుకేగా ఈ టపా రాసాను.
@సౌమ్య: సౌమ్య గారు మాకు ఏడాది పొడుగునా మామిడి పండ్లు వస్తూనే ఉంటాయి.
రెండిటికీ లంకెందబ్బా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి