7, ఏప్రిల్ 2010, బుధవారం

చరిత్రలో ఈ రోజు

ఇవాళ మా దేశానికి బ్లాక్ డే. ఇవాల్టినుండి వారం రోజులు ఇక్కడ సంతాపదినాలు. ఎటువంటి శుభకార్యాలు జరగవు, హోటల్స్, పబ్బులు లాంటివి నడవవు. ఒకవేళ నడిచినా ఎలాంటి సంగీతం వినపడకూడదు. ఎట్లాంటి హడావిడి చేయకూడదు. అసలు ఎందుకిలా అంటే "ప్రపంచ చరిత్రలో మా దేశానికి ఒక రుధిరాధ్యాయం ఉంది".

దేశం పేరు రువాండా. కాంగో, ఉగాండా, బురుండి దేశాలు సరిహద్దులుగా ఉన్న తూర్పు / మధ్య ఆఫ్రికా దేశం ఇది. ఇక్కడ రెండు జనాభా మొత్తం రెండు జాతులుగా వర్గీకరించబడినది. పొట్టి వారు మరియు పొడుగు వారు. ఈ ఒక్క జాతి బేధం తప్ప ఎలాంటి అసమానతలు, కొట్లాటలు వీరి మధ్య లేవు. కుల మతాలకి అతీతంగా ఉంటారు. ఆకలి బాధ తప్ప వీరి చేత వేరే ఏ శక్తి తప్పు చేయించలేదు. ఈ రెండు జాతుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగానే ఉండేవి. వారిలో వారికి వివాహ బంధాలు కూడా నడిచేవి. ఒక కుటుంబంలో సమాన సంఖ్యలో రెండు జాతుల వారూ ఉండేవారు. కానీ అధికారం మాత్రం ఎక్కువగా పొడుగువారి అధీనంలో ఉండేది. దేశం లోని ముఖ్యమైన పదవుల్లో పొడుగు జాతి వారే ఉండేవారు. అలాంటి సమయంలో...... ఒక రోజు......

అది 1994 వ సంవత్సరం, ఏప్రిల్ 6 వ తేది, సాయంత్రం సుమారు ఆరుగంటల సమయంలో ఈ దేశ రాష్ట్రపతి జువేనేల్ హబ్యారిమాన (సరి అయిన ప్రినంసేషన్ నాకు తెలియదు) ఎక్కిన విమానం పేల్చివేయబడినది. అది మొదలుకొని వంద రోజుల పాటు అంటే జూలై నెల మూడోవారం దాకా ఇక్కడ జరిగిన దారుణ మారణ హోమం ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ రెండు జాతులు నడిరోడ్డు మీద ఒకరినొకరు నరుక్కోడం మొదలెట్టారు. ఇది ఏ రాజకీయాలకో పరిమితం అనుకునేరు.. కానే కాదు సామాన్య ప్రజల మధ్య జరిగింది. ప్రతీ వాడు ఒక కత్తి పట్టుకుని రోడ్డు మీదికి రావడం ఆ రెండవ జాతి మనిషి ఎవడు కంటబడితే వాడిని నరికి చంపడం. ఇలా వంద రోజుల పాటు జరిగిన నరమేధంలో సుమారు పది లక్షల మంది అసువులు బాసారని ఒక అంచనా.

కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఈ హత్యాకాండ జరిగింది. ఒక భర్త తను పొట్టి వాడు అయి ఉంటే తన కుటుంబంలోని పొడుగువారిని నరికి చంపేవాడు (బంధాలకి అతీతంగా). ఇది స్త్రీలు వృద్ధులు పసి పిల్లలు అని ఎలాంటి తారతమ్యం లేకుండా జరిగిన దారుణం. గర్భిణి స్త్రీలను కూడా నరికి చంపారని ఒక సమాచారం. ఐ.రా.స బలాలు కూడా ఇక్కడ పని చేయలేకపోయాయి. స్వచ్చంద సంస్థలు సైతం గాయపడిన వారికి వైద్యం రహస్యంగా అందిచాల్సిన పరిస్తితి.

ఒక వంక ప్రపంచం అంతా శాంతి మంత్రం జపిస్తూ, వసుధైక కుటుంబ భావనకోసం పాటు పడుతుంటే, ఇక్కడ మాత్రం రోడ్లు, కాలవలు, చెరువులు అన్ని రక్తమయం. ఎక్కడికక్కడ శవాల గుట్టలు, నరికివేయబడ్డ తలలు, కాళ్ళు, చేతులతో భయానకమైన దృశ్యాలు. ప్రపంచలోని ఏ శక్తి ఆ రోజున ఇక్కడ ఈ మారణ హోమాన్ని ఆపలేకపోయింది. ఇందులో ఒకే ఒక మినహాయింపు విదేశీయులు. ఆ సమయంలో ఇక్కడ వివిధ వృత్తుల్లో ఉన్న విదేశీయులని మాత్రం దోపిడీకి పరిమితం చేసి ప్రాణాలతో వదిలేసారు. ఇప్పటికీ ఇక్కడ చిన్నారులకి చరిత్ర పాఠాలు చెపుతుంటే, ఈ దారుణాన్ని విని తట్టుకోలేక స్పృహ తప్పిన ఆ పిల్లలని వైద్యశాల కి తరలించడం నా కళ్ళతో నేను చూసాను. అయితే ఇంతటి నరమేధానికి గల కారణం కేవలం అధికార కాంక్ష అని ఒక అంచనా.

"ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం......
............ నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం"

అయితే వంద రోజులు పూర్తి అయిన తరువాత ప్రస్తుత రాష్ట్రపతి, అప్పటి సైన్యాధికారి అయిన గౌరవనీయులు శ్రీ పాల్ కగామే గారు మొత్తం పరిస్థితిని అధీనంలోకి తెచ్చి శాంతి స్థాపన చేసారు. ఈ జేనోసైద్ తరువాత రువాండా మొత్తం ఆఫ్రికన్ దేశాల్లోనే సురక్షితమైన, శాంతి వంతమైన దేశంగా స్థిరపడింది. ఈ రోజు ఇక్కడ మేము అర్ధ రాత్రి దాటాక కూడా రోడ్ల మీద తిరగచ్చు నిస్సందేహంగా. బహుశా యుద్ధం ముగిసిన తరువాత ప్రశాంతత కావచ్చు.

ఘటనకు సంబంధించిన ఫోటోలు చూడాలనుకుంటే గూగుల్ సెర్చ్ లో రువాండన్ జేనోసైడ్ అని చూడొచ్చు. అంతటి భయంకరమైన దృశ్యాలు బ్లాగులో ఉంచడం మనస్కరించలేదు, అందుకే నేను పెట్టలేదు.

20 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

హ్మ్ జాతి,వర్ణ,వర్గ,లింగ,భాషీయ,ప్రాంతీయ బేధాలు విన్నాం కానీ ఈ పొట్టి పొడుగుల గోల వినలేదు. ఈ బేధం కడు ఖేదాన్ని కలిగిస్తోంది. మనుషులకి కొట్లాడుకోవడానికి ఒక కారణం అవసరం లేదన్న నిజం వినడానికే భయంకరంగా ఉంది. రాగద్వేషాలకి అతీతంగా మానవులు ఎప్పటికి ఎదుగుతారో !

కత పవన్ చెప్పారు...

ఇటువంటి సాంఘటనలు ప్రతి దేశ చరిత్రలో జరిగాయి జరుగుతునే ఉన్నాయి, రెండు రోజుల ముందు వరకు మన రాష్ట్రం లో జరిగింది ఇటువంటిదే కాని అక్కడ లక్షల మంది ఇక్కడ వందల మంది కాని నష్టం మాత్రం అదె//నిన్నటికి నిన్న సుమారు వంద మంది జవానులను చంపేశారు.
మా జిల్లాలో ప్రతి పల్లే రక్తం తో పారిందే..మా పల్లేలు పాత కక్షలు బయట పడితే ఇంకా దారుణంగా ఉంటుంది పరస్ధితి...
స్వర్ణమల్లిక గారు మీరు రాసిన విధానం చాలా బాగుంది..

బంతి చెప్పారు...

చదువుతూ ఉంటె బాధగా ఉంది ఏంటో ... హ్మ్మ్

స్వర్ణమల్లిక చెప్పారు...

వ్యాఖ్యానించిన అందరికి ధన్యవాదములు.

@ సౌమ్య గారు: మనిషి ఐకమత్యంగా ఉండడానికి కన్నా, కొట్టుకోడానికి కారణాలు వెతుక్కుంటున్నాడు.

@ పవన్ గారు: ఇటువంటి ఘటనలు చరిత్రకి కొత్త కాదు.. కానీ ప్రపంచీకరణ నేపధ్యంలో, ఇరవై ఒకటో శతాబ్దానికి చేరువలో, ఇంత భయానకంగా జరగడం ఆశ్చర్యకరం. మనిషి కనీస అవసరాల కోసం కొట్టుకోవచ్చు, దేశాల మధ్య యుద్ధాలు జరగచ్చు, కుల మతాల కుమ్ములాటలు కూడా కొంతలో కొంత ఏదో కారణం మీద జరుగుతాయి. కానీ ఎలాంటి సరి అయిన కారణం లేకుండా లక్షల ప్రాణాలు ఇలా బలవడం అన్నది ఇక్కడే జరిగిందేమో...

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

నిజమేనండి మనిషి ఐకమత్యంగా ఉండడానికన్న కొట్టుకోడానికి కారణాలు వెతుక్కోడం అన్నమాట అక్షర సత్యం.
మీరు చెప్పినట్టే యుద్ధం ముగిసాక వచ్చిన ప్రశాంతతలాగే ఉంది మీ ఊరు చెప్పిన విషయాల్ని బట్టిచూస్తే.
ఓ కొత్త విషయం తెలియచెప్పారు(కొట్టుకోడానికి పొట్టి పొడుగూ కూడా కారణం అన్నది).

నాగప్రసాద్ చెప్పారు...

చదువుతూ ఉంటేనే ఎలాగో ఉంది. భూమి మీద ఎప్పటికప్పుడు జనాభాను నియంత్రించడానికి దేవుడు ఇలాంటి కలహాలను సృష్టించాడేమో మనుషుల మధ్య.

karthik చెప్పారు...

discrimination has become a human trait. this has been proved by this incident once again..
నేను మతకల్లోలాలు జరిగినప్పుడు ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను.. మనిషులు ఒకరినొకరు చంపుకోవడానికి ఒక మంచి కారణం దొరికింది అని. ఈ మతాలు కులాలు లేకుంతే మనుషులు ప్రశాంతంగా ఉంటారని నేనౌకోను.. ఎందుకంటే అప్పుడు బట్టతల ఉన్న మనుషులు జుట్టున్న వాళ్ళని.. పెద్ద కళ్ళున్న వాళ్ళు చిన్న కళ్ళున్న వళ్ళని చంపుకుంటారు..
అందుకే "ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం......
............ నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం" అనేది ఒక నిష్ఠుర సత్యం !!

durgeswara చెప్పారు...

చదివితేనే మనసు వికలమై పోయింది .ఇక ప్రత్యక్షంగా చూసిన వారెంత నరకాన్ని అనుభవించివుంటారో .

హరే కృష్ణ చెప్పారు...

ఎంత బాధాకరమైన సంఘటన
ఆ ఫోటోలు చూస్తుంటూనే వణుకు పుడుతోంది


"ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం......
............ నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం"
సరిగ్గా చెప్పారు

హరే కృష్ణ చెప్పారు...

ఎంత బాధాకరమైన సంఘటన
ఆ ఫోటోలు చూస్తుంటూనే వణుకు పుడుతోంది


"ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం......
............ నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం"
సరిగ్గా చెప్పారు.

కత పవన్ చెప్పారు...

http://www.guardian.co.uk/world/video/2008/dec/18/rwanda-genocide

Saahitya Abhimaani చెప్పారు...

ఆఫ్రికాలో జరిగే అన్ని గొడవలకూ కారణం తెగల మధ్య వైషమ్యాలు. తెల్లవాళ్ళు, ఇంగ్లాండు, ప్రెంచి, బెల్జియం, హాలెండు దేశాలవారు వలస వాదులుగా ఆఫ్రికా ఖండాన్ని ఆక్రమించుకుని, దాన్ని చీకటి ఖండమని పిలుస్తూనే, దారుణంగా దోచుకున్నారు. అంతేకాక, అక్కడ ఏనాడులేని, రాజకీయ దేశాలను ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేయటానికి ప్రాతిపదిక ఎవరు ఎంతవరకు ఆక్రమించుకున్నారో అంతవరకు. అందుకనే అఫ్రికా ఖండంలో ధేశాల మధ్య సరిహద్దులు వంకర టింకరలు లేని సూటి గీతలుగా ఉంటాయి. మిగిలిన దేశాలలో సామాన్యంగా సహజ సరిహద్దులు-కొండలో, నదులు లేదా అరణ్యాలు, ఎడారి వంటివి-ఉండి ఆదేశ మాప్ చూస్తే అనేక వంకరలు తిరిగి ఉంటాయి. కాని ఆఫ్రికాలో మానవ కల్పిత సరిహద్దులు. దీనివల్ల జరిగిందేమిటి? పూర్వం తెగల రాజ్యాలుగా ఉన్న ప్రదేశాలు ఒక్కొక్కటి రెండు మూడు దేశాల మధ్య విభజించపడినాయి. దీనివల్ల, ఒక తెగవారు ఒక దేశంలో ఎక్కువ మరొక దేశంలో తక్కువ అయిపోయారు. ఎప్పుడైతే ప్రజలలో ఉన్న రకరకాల తెగలసంఖ్య సమంగా లేదో మానవ సహజమైన గొడవలు జరగటం మొదలుపెట్టయి.

రువాండాలో జరిగిన జాతుల యుధ్ధం, కళ్ళకు కట్టినట్టుగా "హోటల్ రువాండా" అన్న సినిమాలో చూపించారు. ఆ సినిమా ఎంత సహజంగా ఉందంటే, రెండోసారి చూడలేనంత భయం వేసింది. మా స్టాఫ్ ట్రైనింగు కాలేజీలో, పరిస్తితుల ప్రాబల్యం వల్ల ఒక వ్యక్తిలోని నాయకత్వ లక్షణాలు ఎలా బయటకు వస్తాయి అన్న విషయం చూపటానికి ఈ సినిమా చూపించాము.

స్వర్ణమల్లిక చెప్పారు...

శివ గారు, చాలా విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదములు. ఈ విషయం గురించి ఎంత రాసినా తక్కువే అవుతుంది. రువాండన్ జేనోసైడ్ మీద చాలా సినిమాలు తీసారు, పుస్తకాలు రాసారు. మీరు చెప్పిన సినెమా దొరుకుతుందేమో వాకబు చేస్తాను.

వ్యాఖ్యానించినందుకు, తెలియని సమాచారం తెలియచేసినందుకు ధన్యవాదములు. ప్రపంచంలో మొదటి మానవుని ఉనికి ఆఫ్రికా ఖండంలో దొరికిందని చరిత్రకారులు చెపుతారు. ఆఫ్రికన్ చరిత్ర తెలుసుకోవాలని నా ఆశ, కానీ దానికి సంబంధించిన పుస్తకాలు అవి పెద్దగా తెలియదు. పెద్దవాళ్ళని ఎవరినైనా అడగాలి అనుకుంటున్నాను. మీకు తెలిస్తే దయచేసి చెప్పగలరు.

స్వర్ణమల్లిక చెప్పారు...

పవను గారు, లింకు ఇచ్చినందుకు ధన్యవాదములు.

మంచు చెప్పారు...

హొటల్ రువాండా చుడాల్సిన సినిమా.. అది రియల్ లైఫ్ స్టొరీ.. ఈ మూవీనే ఆఫ్రికన్ షిండ్లర్స్ లిస్ట్ అనికూడా అంటారు.. షిండ్లర్స్ లిస్ట్ లాగానే చూసిన వెంటనే అంత త్వరగా మర్చిపొలేం... హీరొ కొ ఆస్కార్ వస్తుందను కున్నా కానీ లాస్ట్ లొ మిస్స్ అయింది.. ఆ మూవీ చూసాకా గూగుల్ లొ మొత్తం రువాండా హిస్టరీ అంతా చదివెసా ..

శివ గారు : మీరు చెప్పింది కరెక్టే... మరో మాట అమెరికా రాస్ట్రాల మద్య కూడా సరిహద్దులు అలాగే వంకర టింకరలు లేని సూటి గీతలుగానే ఉంటాయి.. :-)))

Saahitya Abhimaani చెప్పారు...

If you want to know about Africa more, you can start reading with Inside Africa by John Gunther. Although its like a Travalogue, it gives an insight into that area of the world. You can just see the following link for a few details about the book.

http://www.fantasticfiction.co.uk/g/john-gunther/inside-africa.htm

స్వర్ణమల్లిక చెప్పారు...

శివ గారు, సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు. నేను మీరు చెప్పిన పుస్తకం గురించి తప్పకుండా ప్రయత్నిస్తాను.

Unknown చెప్పారు...

Heart Touching Post,

Sirisha చెప్పారు...

chala baga rasaru...mukyam ga meeru rasina vidhanam chadivinchela undi....mana chootu enno jarugutuntayi konni eppatiki gurtundipotayi...pictures choosanu ammo...chala bayamkaramga unnayi...

vijay చెప్పారు...

నేపథ్యం వేరైనా అన్ని దేశాల లో పైశాచిక ప్రవృత్తిని, దానవత్వాన్ని చవిచూస్తున్నారు.
మీ యొక్క స్పందన చాలా బాగుంది.
"అంతటి భయంకరమైన దృశ్యాలు బ్లాగులో ఉంచడం మనస్కరించలేదు, అందుకే నేను పెట్టలేదు."
ప్రతి రోజూ దిన పత్రికలలో ఇటువంటి దృశ్యాలను చూస్తున్నాము.

కామెంట్‌ను పోస్ట్ చేయండి